భారత్‌లో అమెజాన్ ప్రైమ్ ఎయిర్ సేవలు ప్రారంభం..
హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో ప్రారంభం..
హైదరాబాద్ (CLiC2NEWS):
అమెజాన్ సేవలు మరింత వేగం పెంచేందుకు భారత్‌లో అమెజాన్ ఎయిర్ సర్వీసులను ప్రారంభించింది. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వస్తువులను త్వరగా డెలివరీ చేయడానికి కార్గో (బోయింగ్ 737-800) విమానాలను వినియోగించనుంది. దీనికోసం బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ సంస్థతో అమెజాన్ ఒప్పందం చేసుకుంది. మొదటిసారిగా 2016 అమెరికాలో అమెజాన్ ఎయిర్ సేవలు ప్రారంభించింది. అనంతరం యుకెకు విస్తరించింది. ఈ రెండిటి తర్వాత ఈ సేవలను భారత్‌లో ప్రారంభిస్తున్నారు.
హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పట్ల అమెజాన్ ప్రేమ కొనసాగుతోందని ట్వీట్ చేశారు. అమెజాన్ ఇప్పటికే అతిపెద్ద క్యాంపస్‌ను, డేటా సెంటర్, అతిపెద్ద పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను నగరంలో ప్రారంభించిందని.. తాజాగా ఎయిర్ సేవలనూ అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు.