ఆపరేషన్‌ చేసి..కడుపులో కత్తెర మరిచారు

వరంగల్‌ : రోగికి ఆప‌రేష‌న్ చేసి క‌డుపులోనే క‌త్తెర మ‌ర్చిపోయిన సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ ఎంజిఎం ఆస్ప‌త్రిలో చోటుచేసుకుంది. బాధితుడికి క‌డుపులో నొప్పి విప‌రీతంగా రావ‌డంతో మ‌ళ్లీ ఎంజిఎం ఆస్ప‌త్రికి చికిత్స‌కోసం రావ‌డంతో బుధ‌వారం వైద్యులు ఎక్స్‌రే తీయ‌గా ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ విషయం బయటకు పొక్క‌కుండా విశ్వ‌య‌త్నం చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన రాజాం (55) కొద్దిరోజులుగా అల్సర్​తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు సర్జరీ చేశారు. కొద్దిరోజులుగా ఆయనకు కడుపులో నొప్పి ఎక్కువవుతుండటంతో రెండు రోజుల కిందట మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుధవారం ఎక్స్​రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు తలపట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.