ఐపిఎల్‌లో రాణించే ఐదుగురు యువ క్రికెట‌ర్స్‌: సౌర‌బ్‌ గంగూలీ

 

బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌర‌భ్ గంగూలీ భ‌విష్య‌త్‌లో ఐపిఎల్‌లో పెద్ద ఆట‌గాళ్లుగా మారే ఐదుగురు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశాడు. ఇటీవ‌ల ఓ షోలో పాల్గొన్న గంగూలీ ఐపిఎల్‌లో రాణించే యువ క్రికెట‌ర్ల‌ను సెలెక్ట్ చేశాడు. మొద‌టి స్థానంలో పృథ్వీ షాని, రెండ‌వ స్థానంలో రిష‌బ్ పంత్‌.. మూడ‌వ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌లు ఉన్నారు. మిగ‌తా రెండు స్థానాల్లో ఉమ్రాన్ మాలిక్‌, శుభ్‌మ‌న్ గిల్ లు ఉన్నారు. అయితే సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆట తీరు ప‌రంగా అత్యుత్త‌మ ఆట‌గాడ‌ని.. అత‌నిని యువ ఆట‌గాళ్ల లెక్క‌లోకి కాకుండా స్పెష‌ల్ కేట‌గిరిలో ఎంపిక చేశాడు. పృథ్వీ షా, రిష‌బ్ పంత్ ఎంతో ప్ర‌తిభ‌ను క‌లిగి ఉన్నారని.. యువ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్ ఫిట్ గా ఉంగే త‌న పేస్‌తో మ్యాచ్‌పై అభిమానుల‌కు ఆస‌క్తి ఏర్ప‌డేలా చేస్తాడ‌ని గంగూలీ తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.