రెండు రైళ్లు ఢీకొని 32 మంది స‌జీవ‌ద‌హ‌నం

తెంపీ (CLIC2NE): గ్రీస్‌లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి ఏథెన్స్ నుంచి థెసాలోన్కి కి ప్ర‌యాణికుల‌తో వెళ్లున్న ఓ రైలు.. తెంపీ స‌మాపంలో ఎదురుగా వ‌స్తున్న కార్గో రైలును బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 32 మంది ప్ర‌యాణికులు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. మ‌రో 85 మందికిపైగా గాయ‌ప‌డిన‌ట్లు స్థానిక మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఈ ఘ‌ట‌న‌లో మూడు బోగీల్లో బారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. మిగతా బోగీలు ప‌ట్టాలు త‌ప్పి ప‌డిపోయాయి. విష‌యం తెలుసుకున్న అధికారులు. రెస్కూ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో రైల్లో దాదాపు 350 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు ఒక అధికారి తెలిపారు. కాగా వీరిలో 200 మంది ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా కాపాడారు. క్ష‌త‌గాత్రుల్లో కొంద‌రి ప‌రిస్థితి విష‌య‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.