ఉత్తరాదిని ముంచెత్తిన వరద.. 28 మంది మృతి
ఢిల్లీ (CLiC2NEWS): ఉత్తరాదిలో భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, భవనాలు, వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇప్పటి వరకు 28 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మూడు రోజులులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. యమునా నది వార్నింగ్ మార్క్‌ను దాటి ప్రమాదకర స్థితిలో ఉంది. ఏ క్షణమైనా నది ఉప్పోంగి వరదలు సంభవించే ముప్పు పొంచి ఉందని ఢిల్లీకి వరద హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సోమవారం ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్ ప్రాంతాలలో విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్ నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. ఈ నది ధాటికి వంతెనలు సైతం కొట్టుకుపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Praying for Himachal. For decades it has been my abode for months every year. I have seen it getting overloaded and crumbling due to unregulated growth. Many cities including Shimla are waiting to collapse some day. pic.twitter.com/2yQLMwx5fc
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 10, 2023
