రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా : విద్యా మంత్రి సబిత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు.
దసరా వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించమని తెలిపారు. అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను యూనివర్సిటీ వర్గాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా జేఎన్టీయూ, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలు సైతం ఇటీవల వాయిదా పడ్డాయి. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు.