TS: డిగ్రీలో సైబర్ సెక్యూరిటి కోర్సు ప్రారంభం..
హైదరాబాద్ (CLiC2NEWS): డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటి కోర్సును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సోమవారం ప్రారంభించారు. బిఎ, బికాం, బిఎస్‌సి డిగ్రీలో నాలుగో సెమిస్టర్‌లో సైబర్ సెక్యూరిటిని నాలుగు క్రెడిట్లతో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే నూతన కోర్సులను ముందు ముందు ఇంకా ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్‌బి రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. మూల్యంకనంపై ఐఎస్‌బి ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి సూచించారు. బోధన మూస పద్ధతిలో జరగకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. నేపథ్యంలో విద్యార్థి దశనుండే సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని.. వాటిని ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటి కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.