ఉత్కంఠంగా సాగుతున్న భారత్, పాక్ జట్ల మధ్య పోరు
23 ఓవర్లకు పాక్ స్కోర్ 96/5
కొలంబో (CLiC2NEWS): పాక్ జట్టు ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 122*, కెఎల్ రాహుల్ 111* పరుగులు చేసి.. 233 పరుగులు జోడించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 56, శుభ్‌మన్ గిల్ 58 పరుగులు సాధించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 21 ఓవర్లలో 83 పరుగులు చేసింది. 11 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.
వర్షం కాస్త తగ్గిన తర్వాత తిరిగి 9.20 గంటలకు ప్రారంభమైంది. ఇమామ్ ఉల్ హక్ (9) గిల్ చేతికి చిక్కి పెవిలియన్ బాటపట్టాడు. 17 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. 11వ ఓవర్లో బాబర్ అజామ్ (10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ 43 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 12వ ఓవర్లో రిజ్వాన్ (2) పెవిలియన్‌కు చేరాడు. 47 పరుగులకు పాక్ మూడో వికెట్ కోల్పోయింది. 19వ ఓవర్లో ఫఖర్ జమాన్ (27) కుల్ దీప్ యాదవ్ బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో పాక్ జట్టు 77 పరుగుల వద్ద నాల్గవ వికెట్ నష్టపోయింది.