IND vs PAK: 228 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం

కొలంబొ (CLiC2NEWS): భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2023 సూప‌ర్ -4 లో భార‌త్ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.
356 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్ సేన 32 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగ‌లు చేసింది. చివ‌రి బ్యాట‌ర్లు న‌సీమ్ షా, హారిస్ ర‌వూఫ్ బ్యాటింగ్‌కు దిగ‌లేదు. దీంతో ఆలౌట్‌గా ప‌రిగ‌ణించారు. దీంతో భార‌త్ 228 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. కుల్‌దీప్ యాద‌వ్ ఇప్తికార్ అహ్మ‌ద్ (23)ను పెవిలియ‌న్ ప‌ట్టించి.. మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి విజ‌యాన్ని సుమ‌గం చేశాడు. భార‌త్ బ్యాట‌ర్లు విరాట్ కోహ్లీ 122*, కెఎల్ రాహుల్ 111* ప‌రుగులు చేసి.. 233 ప‌రుగులు జోడించారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 56, శుభ్‌మ‌న్ గిల్ 58 ప‌రుగులు సాధించారు.

ఉత్కంఠంగా సాగుతున్న‌ భార‌త్, పాక్‌ జ‌ట్ల మ‌ధ్య పోరు

Leave A Reply

Your email address will not be published.