గుంత‌క‌ల్లులో విషాదం.. నాప‌రాయి మీదప‌డి ఐదేళ్ల చిన్నారి మృతి

గుంత‌క‌ల్లు (CLiC2NEWS): పాఠ‌శాల త‌ర‌గ‌తి గ‌దిలో నాప‌రాయి ప‌డి యుకెజి చ‌దువుతున్న ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలోని గుంత‌క‌ల్లు ప‌ట్ట‌ణంలో చోటుచేసుకుంది. ఈ రోజు చిన్నారి పుట్టిన‌రోజు కావ‌డంతో చిన్నారి తోటి విద్యార్థుల‌కు చాక్లెట్లు పంచింది. చిన్నారి నిద్రిస్తున్న స‌మ‌యంలో నాప‌రాయి మీద ప‌డ‌టంతో తీవ్ర ర‌క్ర‌స్రావమ‌వ‌టంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు గుంత‌క‌ల్లు ప్ర‌భుత్వ ఆసుపత్రి వైద్యులు ధ్రువీక‌రించారు. చిన్నారి పుట్టిన‌రోజు నాడే మృతి చెంద‌డంతో అటు కుటుంబంలోనూ, ఇటు పాఠ‌శాల‌లోను విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.