టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌ని తొలగించాలంటూ ఓయూ విద్యార్థుల ధర్నా..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును రద్దు చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఎస్‌పిఎస్‌సిని ఛైర్మన్‌ను తొలగించాలని, కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేదని.. పరీక్షను పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనికి భాద్యత వహిస్తూ సిఎం, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ స్టేషన్‌కు తరలించారు.