అవ‌యువ దానం చేసే వారికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు: స్టాలిన్ స‌ర్కార్‌

చెన్నై (CLiC2NEWS): అవ‌యువ దానం చేసేవారికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఆయ‌న మాట్లాడుతూ.. ఆర్గాన్ డోన‌ర్స్ విష‌యంలో దేశంలో త‌మిళ‌నాడు రాష్ట్రం అగ్ర‌గామిగా ఉంద‌ని సిఎం అన్నారు. విషాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల‌లో త‌మ ఆత్మీయుల అవ‌యువాల‌ను దానం చేసేందుకు ముందుకొచ్చే కుటుంబాల నిస్వార్థ‌మైన త్యాగాల ఫ‌లితం వ‌ల‌నే ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా ప్ర‌తి ఒక్క‌రూ అవ‌యువ దానం చేసేలా ప్రోత్స‌హించాల‌న‌నారు. అవ‌యువ దాత‌ల త్యాగాల గుర్తించి.. డోన‌ర్స్ అంత్య‌క్రియ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున గౌర‌వం ఇవ్వాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సిఎం వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.