పాక్‌పై టీమ్ ఇండియా ఘన విజయం..
అహ్మదాబాద్ (CLiC2NEWS): వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్ , భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో పాక్‌పై విజయం సాధించిన భారత్ ప్రపంచకప్ లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆడిన ఏడుసార్లు భారత్ విజయం సాధించింది. తాజాగా ఇపుడు ఎనిమిదోసారి గెలుపొంది ఆ రికార్డును పదిలం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 191 పరుగులకు ఆలౌటయింది. 192 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. వచ్చే గురువారం భారత్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.