నిట్ ఎపిలో 24 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్ – 2 పోస్టుల భ‌ర్తీ..

తాడేప‌ల్లి గూడెం (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తాడేప‌ల్లి గూడెంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జి లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు 24 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్ట‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. బ‌యోటెక్నాల‌జి, కెమిక‌ల్‌, సివిల్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, మెకానిక‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, హ్యూమానిటీస్ అండ్ మేనేజ్ మెంట్ సైన్సెస్ విభాగాల్లో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

అభ్య‌ర్థుల‌కు సంబంధిత విభాగాల్లో ఫ‌స్ట్ క్లాస్ బ్యాచిల‌ర్ డిగ్రీ, పిహెచ్‌డితో పాటు బోధ‌న‌.. ప‌రిశోధన అనుభ‌వం ఉండాలి. అక‌డ‌మిక్ ప్ర‌తిభ‌, అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ, ప్రెజెంటేష‌న్ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. న‌వంబ‌ర్ 13వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు హార్డ్ కాపి 20వ తేదీ లోపు పంపించాలి. పూర్తి వివ‌రాలు అభ్య‌ర్థులు https://www.nitandhra.ac.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.