ఆ 12 మందిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దు: రేవంత్ రెడ్డి
నకిరేకల్ (CLiC2NEWS): సాయుధ పోరాటాలకు నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ అని రజాకార్ల నుండి ప్రజలకు విముక్తి కల్పించినది నల్గొండ వీరులని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన సభలో శుక్రవారం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ నుండి గెలిచి దొరల గడీల వద్ద కాపలా కాస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయెద్దన్నారు. నల్గొండకు నీరు ఇచ్చే ఎస్ ఎల్ బిసి ప్రాజెక్టును ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలదని, 10 కిలోమీటర్ల టన్నెల్ పదేళ్లుగా ఎందుకు పూర్తి కాలేదని , తన ఫామ్‌హౌస్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకున్న కెసిఆర్ నల్గొండకు నీరు ఎందుకివ్వలేదని రేవంత్ ప్రశ్నించారు