గుజరాత్‌లో పిడుగుపాటుకు గురై 20 మంది మృతి
అహ్మదాబాద్ (CLiC2NEWS): గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి. వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడి 20 మంది మృతిచెందినట్లు సమాచారం. రాజ్‌కోట్ , మోర్బీ జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు కురవటంతో పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. పిడుగుపాటుకు గురై పలువురు మృతిచెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశాలున్నట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా వార్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.