తెలుగు రాష్ట్రాలలో నేటి బంగారం ధరలు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గి.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,130గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950గా ఉంది. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధర సోమవారం రూ. 220 వరకు తగ్గింది. విజయవాడ, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు ప్రాంతాలలో ఇదే ధర ఉంది. చెన్నైలో నేడు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,500గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 62,730గా ఉంది.