లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బిజెపికి 370 సీట్లు ప్ర‌ధాని మోడి

ఝ‌బువా (CLiC2NEWS): త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బిజెపికి 370కి పైగా స్థానాల‌ను గెలుచ‌కొంటుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడి ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివానం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మోడి ప‌ర్య‌టించారు. రూ. 7,550 కోట్ల‌కు పైగా నిధుల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోడి ప్ర‌సంగిస్తూ.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం రెట్టింపు వేగంతో ప‌నిచేస్తోంద‌ని కితాబు ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అద‌నంగా పోల‌య్యేలా చూడాల‌ని, 370 స్థానాల‌కు పైగా బిజెపి గెలిచేలా ఆశీర్వ‌దించాల‌ని కార్య‌క‌ర్త‌ల‌ను, ఓట‌ర్ల‌ను కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.