న‌గ‌ర మంచినీటి వినియోగారుల‌కు విజ్ఞ‌ప్తి..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల‌లోని నీటివినియోగ‌దారులు త‌మ న‌ల్లాల‌కు మోటార్ల బిగించుకోవ‌డం  అధికారుల దృష్టికి వ‌చ్చింద‌ని జ‌ల‌మండ‌లి అధికార‌లు తెలిపారు. దీని వల్ల మిగిలిన వినియోగదారులకు.. లో- ప్రెజ‌ర్ తో నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. జ‌ల‌మండ‌లి విజిలెన్స్ అధికారులు క్ర‌మంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఎవ‌రైనా వినియోగ‌దారులు ఇలా త‌మ న‌ల్లాల‌కు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జ‌ల‌మండలి నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు మోటార్లు సీజ్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కాబ‌ట్టి వినియోగ‌దారులెవ‌రూ న‌ల్లాకు మోటార్లు బిగించ‌వ‌ద్ద‌ని జ‌ల‌మండ‌లి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

ఒక‌వేళ త‌క్కువ ప్రెజ‌ర్ తో నీరు  స‌ర‌ఫ‌రా అయినా.. లేదా నీటి స‌ర‌ఫ‌రాలో ఏవైనా ఇతర స‌మ‌స్య‌లు త‌లెత్తినా.. త‌మ‌కు ద‌గ్గ‌ర్లోని సంబంధిత మేనేజ‌ర్, డీజీఎం, జీఎం అధికారుల‌ను సంప్ర‌దించాలి. లేదా జ‌ల‌మండ‌లి క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌రు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. వాటిపై తప్పకుండా త‌గిన చర్యలు తీసుకుని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.