కూమార్తె  ప్రేమ వ్య‌వ‌హారం.. కూతురిని హ‌త‌మార్చిన త‌ల్లి!

ఇబ్ర‌హీంప‌ట్నం (CLiC2NEWS): ఓ క‌న్న‌త‌ల్లి త‌న‌ కుమార్తె ప్రేమ వ్య‌వ‌హారం న‌చ్చ‌క..  క‌న్న‌బిడ్డ‌ను తానే హ‌త‌మార్చింది. ఈ ఘ‌ట‌న ఇబ్ర‌హీంప‌ట్నం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాం ప్ర‌కారం.. దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐల‌య్య‌, జంగ‌మ్మ దంప‌తుల‌కు కుమార్తె, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. కుమార్తె భార్గ‌వి న‌గ‌రంలోని దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ క‌ళాశాల‌లో డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువ‌తోంది. త‌ల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో ఆమె స్థానికంగా ఓ యువ‌కుడిని ప్రేమిస్తున్నాన‌ని, అత‌న్నే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. త‌ల్లిదండ్రులు ఇంటివ‌ద్ద లేని స‌మ‌యంలో యువ‌కుడు భార్గ‌వి ఇంటికొచ్చాడు. ఆ స‌మ‌యంలో త‌ల్లి జంగ‌మ్మ ఇంటికొచ్చింది. కుమార్తెపై ఆగ్ర‌హంతో చీర‌తో ఉరివేసి హ‌త‌మార్చింది.

Leave A Reply

Your email address will not be published.