AP: ఎన్డిఎ కూటమికే లోక్సత్తా మద్దతు.. జెపి
అమరావతి (CLiC2NEWS): ఎపిలో ఎన్డిఎ కూటమికే లోక్సత్తా పార్టి మద్దతిస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపి, జనసేన, బిజెపి (ఎన్డిఎ)పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల ప్రశాంతంగా జరుగుతాయా.. అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా.. అనే సందేహం ఉంది. నిర్భయంగా నమ్మిన వారికి ఓటు వేయండి. సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటించాలి. ఆర్ధిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరని ఆలోచించాలని, ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నేతలు ఆడుకుంటున్నారని జెపి వ్యాఖ్యానించారు.