తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: మంత్రి హరీష్
సిద్దిపేట :కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి వాపు మాత్రమే.. నిజమైన బలం టీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో టీఆర్ఎస్ యువ గర్జన ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అక్కడ జరిగిన మంత్రి మాట్లాడుతూ.. బిజెపి తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాని రైతులను కష్టాల్లోకి నెడుతుందన్నారు. వ్యవసాయ పంపు సెట్ల వద్ద మీటర్లు తెచ్చిపెట్టి.. రైతులకు ఇబ్బందులు సృష్టిస్తుందని మంత్రి తెలిపారు. బీజేపీ నల్లధనం హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పారు. దేశంలో ఎవరి ఖాతాలోనైనా వేశారా? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలన్నారు. ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా…? అని బిజెపిని మంత్రి ప్రశ్నించారు.