అందాలరాశి నటి జమున
హంపీ నగర కన్య, జక్కనాచార్యుని శిలలో, రవివర్మ వర్ణ చిత్రంలా ఉండే జమున. ఈమె అసలు పేరు యమున. 1937 ఆగస్టు 30వ తేదీన హంపిలోని ప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవిలకు జన్మించారు. ఆమెబాల్యంలో నేతండ్రి వ్యాపారరీత్యా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో స్ధిరపడ్డారు. ప్రముఖ నటుడు జగ్గయ్యగారిది కూడా అదేగ్రామం కావడంతో, ఇద్దరు ఒకే పాఠశాలలో చదివేవారు. జగ్గయ్యగారి వద్ద ట్యాషన్ కు వస్తుండేది.
ఆమెలోని చలాకితనం గమనించిన జగ్గయ్య ఆమెను తొలిసారి ‘ఖిల్జిరాజ్యపతనం` అనేనాటికను తెనాలి సమీపంలోని మండూరుగ్రామంలో ప్రదర్శించారు. ఆ నాటకంలో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించారు. అలా ప్రజానాట్య మండలి వారి ‘మాభూమి` పలు ప్రదర్శనలు ఇవ్వడంతో ఆమె పేరు నాటకరంగంలో మారుమ్రోగింది. ప్రముఖ నటుడు యస్.వి.రంగారావుగారి సమీప బంధువు బి.వి.రామానందం జానపద చిత్రం’జైబేతాళసలో గుమ్మడి కథానాయకుడిగా జమునాను కథానాయకిగా ఎంపికచేసారు. కొంత చిత్రికరణ జరిగిన అనంతరం, ఏవోకారణాలవలన ఆచిత్రం ఆగిపోయింది.
నాటి ప్రజానాట్యమండలిలో తిలక్ (అనుపమబేనర్) గరికపాటి రాజారావుగారు వంటి ఎందరో ప్రముఖులు ఉండేవారు. గరికపాటివారు ‘పుట్టిల్లు'(1953) చిత్రం ద్వారా జమునను వెండితెరకు పరిచయం చేసారు. ఆచిత్రం విజయంసాధించలేకపోయింది. గరికపాటివారు ఆర్ధికంగా చితికిపోయారు. జగ్గయ్య-జమున సినిమారంగంలో స్ధిరపడి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. గరికపాటివారికి సహాయంచేయదలచిన జమున, తనూ జగ్గయ్య ఉచితంగా నటిస్తామని సినిమా తీయమని ప్రోత్సహించారు. గరికపాటి వారు ‘దేవుడుచేసినమేలుసఅనే చిత్రంప్రారంభించి, ఆ చిత్రంముగించకుండానే (1964) ఆయన మరణించారు. ఆయనసంతాప సభలో, లక్షరూపాయల విలువచేసే ఇల్లు మద్రాసు హబిబుల్లారోడ్డులో గరికపాటివారి సతీమణి పేరిట కొనుగోలు చేసి ఇచ్చారు.
జమున నట జీవిత రజితోత్సవ సభహైదరాబాద్లో జరిగినప్పుడు గరికపాటివారి చిత్రపటానికి పూమాల వేసి సభప్రారంభించారు. అది ఆమె గురుభక్తి.’మూగమనసులు'(1964) చిత్రంలో ‘గౌరిసగా, ‘ఉషాపరిణయం'(1961)` ఉష’గా,’శ్రీకృష్ణతులాభారం'(1966)లో ‘సత్యభామసగా నటించడం కోసమే జన్మించిందా! అనిపించేలా నటించారు. హిందీలో తీసిన మూగమనసులు ‘మిలన్సలో గౌరిపాత్రకు ఫిలింఫేర్అవార్డు లభించింది. ఇదేచిత్రం తమిళంలో కూడా జమునే నటించారు. నిర్మాతగా నటి సావిత్రి ఆర్ధికంగా చితికిపోయారు ఈ చిత్రంతో.

తొలుత ఇందిరాగాంధి అభిమానిగా రాజకీయాలలో ప్రవేసించి(1989)లో రాజమండ్రి నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నిక అయ్యరు. అనంతరం రాజకీయాల నుండి తప్పుకున్నారు. తెలుగు, తమిళ, హిందీచిత్రాలలో దాదాపు 200 నటించారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు విశ్రాంత జీవితంగడుపుతున్న వీరికిమనం శుభాకాంక్షలు తెలియజేద్దాం!
-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.