బీహార్‌లో తొలిదశ పోలింగ్ ప్రారంభం
పాట్నా: బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈ రోజు (బుధవారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సుమారు 2 కోట్లకు మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలుండగా, మొదటి విడతగా 71 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. మ్తొతం 243 స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అధికార కూటమితో పాటు ప్రతిపక్ష కూటమికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచి నాల్గవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గద్దె నెక్కుతారా లేదా మహా కూటమి అధినేత, ఆర్జేడీ నేత తొలిసారిగా ఆ పదవిని చేక్కించుకుంటారా..చిరాగ్ పాశ్వాన్ భవితవ్యం ఏ ఏమిటన్నదీ ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలక్షన్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో ఒక్కో పోలింగ్ బూత్‌లోకి 1600 మందికి అనుమతి ఉండగా..ఇప్పుడు వెయ్యి మందికి మాత్రమే అవకాశం కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారికి లేదా కరోనా సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని అందించింది. ఓటింగ్ యంత్రాలను శానిటైజ్ చేయడంతో పాటు ధర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు, సబ్బు, నీరు వంటి సదుపాయాలను ఓటర్లకు అందుబాటులో ఉంచారు.
71 స్థానాలకు గానూ 952 మంది పురుషులు, 114 మంది మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు. అత్యధికంగా గయప పట్టణంలో అసెంబ్లీ స్థానానికి 27 మంది బరిలో ఉండటం గమనార్హం. తొలి దశ ఎన్నికల్లో అధికార జేడీయూ 35 చోట్ల, మిత్రపక్షం 29 చోట్ల బరిలో నిలిచింది.