తెలంగాణ: భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 40,081 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,34,152కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,319కి చేరింది.