పట్టాలు తప్పిన గూడ్స్ .. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
దామచర్ల (CLiC2NEWS): నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గ్యూడ్స్ రైలు ఆదివారం మధ్యాహ్నం పక్కకు ఒరిగిపోయింది. దీంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. తక్కువ స్పీడ్‌తో రైలు వెళుతుండటంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి మిగతా బోగీలు పడిపోకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. గుంటూరు – సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శబరి ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పిడుగురాళ్ల వద్ద నిలిపివేసినట్లు సమాచారం.