తెలంగాణ‌లో రైతుల‌కు శుభ‌వార్త‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని రైతులకు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌నందించింది. రాష్ట్రంలోని రైతుల పంట‌ రుణాల‌ను మాఫీ చేయాల‌ని కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష‌త‌న రాష్ట్ర మంత్రి వ‌ర్గం స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాల‌ను మాఫీ చేయాల‌ని కీల‌క నిర్ణ‌యంతీసుకుంది. 2023 డిసెంబ‌ర్ లోపు తీసుకున్న రుణాల‌కు మాఫీ వ‌ర్తించ‌నుంది. ఆగ‌స్టు 15 నాటికి రుణ‌మాఫి పూర్తి చేస్తామ‌ని గ‌తంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేర‌కు నిధుల స‌మీక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చర్చించిన‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన విధి విధానాల‌ను ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.