శ్రీవారి ప్రత్యేక దర్శనం.. లడ్డూ ధరలలో మార్పులేదు: టిటిడి
తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం ధరలను సవరించినట్లు పలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని పేర్కొంది. తిరుమల రూ. 300 శ్రీవారి ప్రత్యేక దర్శనం , అదే విధంగా రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని టిటిడి క్లారిటి ఇచ్చింది. శ్రీవారి దర్శనం టెకెట్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. టిటిడి వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం విభాగాల ద్వారా కూడా కొన్ని టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు టూరిజం శాఖ ద్వారా కూడా టికెట్లు పొందే సౌకర్యం కలదన్నారు. దళారీల ద్వార కాకుండా నేరుగా ఆయా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ల ద్వారా దర్శనం ప్యాకేజి టికెట్స్ పొందే అవకాశం ఉందని ప్రకటనలో తెలిపారు.