జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

అంత‌టా మువ్వ‌న్నెల పండుగ వాతావ‌ర‌ణం

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

అంత‌టా మువ్వ‌న్నెల పండుగ వాతావ‌ర‌ణం

హైదరాబాద్‌: తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్ళి అమరులకు నివాళర్పించారు. రాష్ట్రం ఆవిర్భావం దగ్గర్నుంచీ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు.

అభివృద్ధిలో ముందువ‌రుస‌లో రాష్ట్రంః కెటిఆర్‌
అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉంద‌ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో శనివారం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు. కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక

74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో, ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో మరియు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాంరెడ్డి గారు. జెండా ఆవిష్కరణ అనంతరం సాయుధ బలాగలచే గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. సిబ్బందికి 74 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగా ఫలితమే స్వాతంత్ర భారతదేశం అని వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం బాగా పని చేసి దేశ పురోగ్రాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, AO వెంకట శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, పట్టణ సిఐ జాన్ దివాకర్, ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు వెంకటి, కృష్ణఆంజనేయులు, ఐటి ఇన్స్పెక్టర్ రవీందర్, మరియు హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, Dpo కార్యాలయం, ఎస్బీ సిబ్బంది పాల్గొన్నారు.

బాసరలో ఘనంగా జెండా పండుగ

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం అమ్మవారి ఆలయములో కార్యనిర్వహణాధికారి కార్యాలయములో 74వ జాతీయ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ సిబ్బంది, మరియు వాగ్దేవి లేబర్ సొసైటీ NMRలు,హోమ్ గార్డ్ సెక్యురిటీ సిబ్బంది, ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిజాతీయ జెండాను ఆవిష్కరించిన ఆలయ Eo వినోద్ రెడ్డి గారు,ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ గారు,ఈ కార్యక్రమములో, ఆలయ పూజారులు, ఆలయ Aeo సుదర్శన్ గౌడ్ గారు,ఆలయ ఇంచార్జ్ పర్యవేక్షకులు సంజీవ్ రావ్ గారు మిగతా ఆలయ సిబ్బంది, వాగ్దేవిలేబర్ సొసైటీ సిబ్బంది, హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దేవరకొండలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
-పాల్గొన్న ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ పట్టణంలో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు.స్వాతంత్ర్య వేడుకలలో ముఖ్య అతిధిగా దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు.RDO కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో,గ్రంధాలయంలో, సహకారం సంఘం వద్ద ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో RDO గోపిరామ్,మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ,ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్,జడ్పీటీసీ మరుపాకుల అరుణసురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్,రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య,PACS చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ,ఎంపీడీఓ పాండు,తహశీల్దార్ కీరణ్మయి,మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్,TRS పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.