రామగిరి పిఎస్ కానస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు
రామగుండం పోలీస్ కమిషనరేట్: క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సిహెచ్. సదానందం క్రమశిక్షణ రాహిత్యంగా, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు సస్పెండ్ చేశారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం . శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం కమిషనేరట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట కి భంగం కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ ఒక ప్రకటన లో తెలిపారు.