మంచిర్యాల,పెద్ద‌ప‌ల్లి జోన్‌ల‌లో పోలీసులు ఆక‌స్మిక త‌నిఖీ..

మంచిర్యాల (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వ‌హించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ధ్రువీకరణ పత్రాలు లేని, డ్రైవింగ్ లైసెన్స్ , ఇన్సూరెన్స్ లేని , నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు , లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి .. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు జ‌రిగింద‌ని తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.