ఎపిలో జులై 8 నుండి ఉచిత ఇసుక విధానం అమ‌లు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఈనెల 8వ తేదీ నుండి ఉచిత ఇసుక విధానం అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఎమ్మెల్యే కొల్లు ర‌వీంద్ర‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. క‌లెక్ట‌ర్ల అధ్య‌క్ష‌త‌న క‌మిటి ఆధ్వ‌ర్యంలో లోడింగ్‌, ర‌వాణా ఛార్జీలు నిర్ణ‌యించ‌నున్న‌ట్లు స‌మాచారం.

రాష్ట్రంలో మ‌ళ్లీ ఉచిత ఇసుక విధానం ప్ర‌వేశ‌పెట్ట‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని గ‌నులశాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర అన్నారు. ఎవ‌రికి ఇసుక కావాల‌న్న సుల‌భంగా అందేలా చేస్తామ‌న్నారు. 2014-19 కాలంలో టిడిపి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింద‌ని.. వైఎస్ ఆర్‌సిపి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దోచుకోవ‌డానికి వాడుకుంద‌ని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.