2026 కల్లా భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తాం: సిఎం చంద్రబాబు
భోగాపురం (CLiC2NEWS): పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని.. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఇది ఒక ఎకనామిక్ హబ్‌గా మారుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ఇన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను సిఎం ఉన్నపుడే అన్ని అనుమతులు వచ్చాయని.. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదిటికి వచ్చిందన్నారు. 2026 జూన్ కల్లా భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామని, దీనిని వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై ఉందని చంద్రబాబు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెల్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు.