ఎపిలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు..
అమరావతి (CLiC2NEWS): బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పూరీ సమీపంలో శనివారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏలూరు, నంద్యాల, శ్రీకాకుళం, వియజనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టిఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సమాచారం.