శ్రీ‌శైలం 5 గేట్లు ఎత్తి నీటి విడుద‌ల‌

శ్రీ‌శైలం (CLiC2NEWS): ఎగువ‌న కురిసిన భారీ వ‌ర్షాల‌తో శ్రీ‌శైలం జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. దీంతో సోమ‌వారం అధికారులు మూడు గేట్ల‌ను ప‌ది అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాగాజా మంగ‌ళ‌వారం మ‌రో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుద‌ల చేశారు. దీంతో శ్రీ‌శైలం నుంచి మొత్తం అయిదుగేట్ల‌ను ఎత్తి నీటిని కింద‌కు విడుద‌ల‌చేశారు.

దాంతో కృష్ణ‌మ్మ నీరు నాగార్జున సాగ‌ర్ వైపు ప్ర‌వ‌హిస్తోంది. శ్రీ‌శైలం జ‌లాశ‌యం స్పిల్ వే ద్వారా 1.35 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు.  ఇన్‌ఫ్లో 4.27 ల‌క్షల క్యూసెక్క‌లు, ఔట్ ఫ్లో 2.21 ల‌క్ష‌ల క్యూసెక్కులు గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 885 అడుగులు, శ్రీ‌శైలం పూర్తిస్థాయినీటి నిల్వ సామ‌ర్థ్యం 215. 80 టిఎంసిలు కాగా. ప్ర‌స్తుతం 202.9 టిఎంసిలుగా న‌మోదైంది. దీంతో కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్క‌డాన్ని వీక్షించేందుకు ప్రాజెక్టు వ‌ద్ద‌కు సంద‌ర్శ‌కులు భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.