రైతుల ఖాతాల్లో రూ. 6.190 కోట్లు జ‌మ‌

రెండో విడ‌త రుణ‌మాఫీ నిధుల‌ను విడుద‌ల చేసిన సిఎం రేవంత్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌. ఇవాళ (మంగ‌ళ‌వారం ) శాస‌న స‌భ ప్రాంగ‌ణంలో రైతుల‌కు రెండో విడ‌త పంట రుణాల‌ మాఫీ నిధులు రూ. 6.190 కోట్ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

“ఏ రైతూ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడ‌ద‌నేనే మా ప్ర‌భుత్వ విధానం. అందుకే ఇవాల రూ. ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు ఉన్న రైతుల రుణాల‌ను మాఫీ చేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేర‌కు రుణ మాఫీ చేశాం. ఈ సారి రెండో విడ‌త‌గా రూ. 6.190 కోట్లు మాఫీ చేశాం. అని పేర్కొన్నారు.
రుణ‌మాఫీ కింద ప్ర‌భుత్వం సుమారు 6.4 ల‌క్ష‌ల మంది రైతు ఖాతాల్లో రెండో విడ‌త‌గా రూ. 6.190 కోట్లు జ‌మ చేసింది. దీంతో రైతుల కుటుంబాల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.