తిరిగి `కారె`క్కిన‌న గ‌ద్వాల ఎమ్మెల్యే

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఇది భార‌త రాష్ట్ర స‌మితి శ్రేణుల్లో ఉత్సాహం నింపే వార్త‌. ఇవాళ (మంగ‌ళ‌వారం) గ‌ద్వాల ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి తిరిగి భార‌త రాష్ట్ర స‌మితి (బిఆర్ ఎస్‌) లో చేరారు. పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కెటిఆర్ కృష్ణ మోహ‌న్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవ‌ల ఆయ‌న బిఆర్ ఎస్‌నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బిఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.