మెదక్: 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
మనోహరాబాద్ (CLiC2NEWS): మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. మనోహరబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై ఉన్న దంపతులిద్దరూ కిందపడిపోయారు. ఏడునెలల గర్భిణి అయిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు విచారణ చేపట్టారు.