యుపిఎస్‌సి నూతన ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్
ఢిల్లీ (CLiC2NEWS): ఆగస్టు 1 నుండి యుపిఎస్సి నూతన ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన మనోజ్ సోనీ ఇటీవల రాజీనామా చేశారు. 2029 మే 15 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఐదేళ్ల ముందుగానే రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారిణి ప్రీతి సుదాన్ నూతన ఛైర్ పర్సన్‌గా నియమితులయ్యారు.