తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా జిష్ణుదేవ్ వ‌ర్మ ప్ర‌మాణస్వీకారం

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా జిష్ణుదేవ్ వ‌ర్మ ప్ర‌మాణం చేశారు. బుధ‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అఓక్ ఆరాధే.. ఆయ‌న‌చే ప్ర‌మాణం చేయించారు. త్రిపుర రాష్ట్రానికి చెందిన జిష్ణుదేవ్ వ‌ర్మ.. 2018 నుండి 2023 వ‌ర‌కు ఆ రాష్ట్రానికి రెండో ఉప ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న 1990లో బిజెపిలో చేరారు. తెలంగాణ నుండి బిజెపి నేత ఇంద్ర‌సేనారెడ్డి త్రిపుర‌ల గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులు కాగా.. అక్క‌డి నుండి జిష్ణుదేవ్ వ‌ర్మ తెలంగాణకు గ‌వ‌ర్న‌ర్‌గా వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు , సిఎస్ శాంతి కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.