వ‌రుణ్ ధావ‌న్-స‌మంత.. ‘సిటాడెల్‌’ టీజర్

Citadel : రాజ్ అండ్ డికె ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ ధావ‌న్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న‌ యాక్ష‌న్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్‌ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని రాజ్ అండ్ డికె ప్ర‌క‌టించారు. హిందీతోపాటు, భార‌తీయ భాష‌లన్నిటిలోనూ ఈ సిరీస్ న‌వంబ‌ర్ 7 నుండి అమెజాన్ ఫ్రైమ్ వీడియో వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్ర‌మంలో సిరీస్ టీజ‌ర్ విడుద‌లైంది. ఈ సిరీస్‌లో సిమ్ర‌న్‌, కెకె మేన‌న్, సోహ‌మ్ త‌దిత‌రులు న‌టించారు. 1990 ల నేప‌థ్యంలో ఈ సిర‌స్ సాగుతోంద‌ని తెలుస్తోంది. స‌మంత ఎలాంటి డూప్ లేకుండా స్వ‌యంగా యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చేసిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.