భార‌త్‌లో 50వేలకు చేరువలో మరణాలు

భార‌త్‌లో 50వేలకు చేరువలో మరణాలు క‌ల‌వ‌ర‌పెడుతోన్న క‌రోనా! గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,489 కరోనా కేసులు రిక‌వ‌రీ రేటు 71 శాతం మ‌ర‌ణాల రేటు దాదాపు 1.9శాతం

భార‌త్‌లో 50వేలకు చేరువలో మరణాలు

క‌ల‌వ‌ర‌పెడుతోన్న క‌రోనా!

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,489 కరోనా కేసులు

రిక‌వ‌రీ రేటు 71 శాతం

మ‌ర‌ణాల రేటు దాదాపు 1.9శాతం

 

ఢిల్లీ : ప‌్ర‌ప‌పంచ‌దేశాల‌తో పాటు క‌రోనా భార‌త్‌ను కూడా క‌ల‌వ‌ర పెడుతోంది. దేశంలో వైర‌స్‌తో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతోంది. రోజుకు దాదాపు 1000 మంది కోవిడ్ రోగులు మృత్యువాత‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. గ‌డిచిన 24 గంట‌లో్ల మ‌రో 944 మంది క‌రోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరితో ఆదివారం నాటికి దేశంలో క‌రోనా కాటుకు బ‌లైన‌వారు 49,980కి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్ల‌డించింది. ఇక పాజిటీవ్ కేసులు‌ రోజురోజుకు మరింతగా పెరుగుతండ‌డం ప్ర‌జ‌ల‌ను భ‌య్ర‌భాంతుల‌కు గురిచేస్తోంది. గడిచిన వారం రోజులుగా 60వేలకు పైగా తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,489 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్‌ బులెటిన​ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25, 89,682గా ఉంది.

గత 24 గంటల్లో కొత్తగా 53,322 మంది డిశ్చార్జి అవ్వగా.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 18,62,258 మంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం 6,77,444 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 71.91 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో.. యాక్టివ్ కేసుల శాతం 26.16 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.93 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశంలో 7,46,608 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 2,93,09,703గా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 71 శాతం దాటగా, మ‌ర‌ణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది. కోవిడ్ మ‌ర‌ణాల్లో భార‌త్ ప్ర‌పంచంలో నాలుగో స్థానంలో ఉంది.

Leave A Reply

Your email address will not be published.