పల్నాడు జిల్లాలో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ పర్యటన
మాచవరం (CLiC2NEWS): వైఎస్ ఆర్ పార్టి నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని, ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. ఆయన మంగళవారం పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను పరిశీలించారు. భూములకు సంబంధించిన వివరాలను అధికారులు పవన్‌కు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సరస్వతి పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ పార్టి అధినేత సొంతంగా భూములు తీసుకున్నారన్నారు.
2009లో వైఎస్ ఆర్ సిఎం గా ఉన్నపుడు 30 ఏళ్లు లీజుకు తీసుకుంటే.. జగన్ సిఎం అయిన తర్వాత దానిని మరో 50 ఏళ్లు పొడిగించారని తెలిపారు. కానీ.. ఆ రోజు నుండి ఇప్పటి వరకూ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదన్నారు. భయపెట్టి, మరో చోట ఉద్యోగాలిస్తామని..ఇలా ప్రజల వద్ద నుండి భూములు లాక్కొని వారిని ఇబ్బందులకు గురిచేశారన్నారు. 400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి.. లాక్కున్నారని స్తానికులు తెలపగా..దీనిపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోస్తా ఇస్తున్నాని పవన్‌కల్యాణ్ తెలిపారు.