డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ
అమరావతి (CLiC2NEWS): ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను హోంమంత్రి అనిత మర్యాద పూర్వకంగా కలిశారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. తానూ ఫేక్ పోస్టు బాధితురాలినంటూ మంత్రి అనిత డిసిఎంతో తెలపారు. అదేవిధంగా తన కూతరు కన్నీరు చూసి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ కల్యాణ్ అన్నారు. గత కొన్ని రోజులుగో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను పవన్‌కు అనిత వివరించారు.
జన సంక్షేమం , శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమని.. ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పవన్‌కు తెలిపారు.