Mahindra: XEV 9e, BE 6E.. రెండు ఎల‌క్ట్రిక్ కార్లు విడుద‌ల

Mahindra: మ‌హీంద్రా నుండి రెండు ఎల‌క్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వ‌చ్చాయి. ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా XEV 9e, BE 6E.. ల పేరుతో రెండు నూత‌న వాహ‌నాల‌ను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇవి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుండి అందుబాటులోకి రానున్నాయి. XEV 9e.. ప్రారంభ ధ‌ర రూ. 21.90ల‌క్ష‌లు (ఎక్స్‌-షోరూమ్‌) , BE 6E.. ప్రారంభ‌ధ‌ర రూ. 18.90 ల‌క్ష‌లు (ఎక్స్‌-షోరూమ్‌) గా ఉంది. ఈ రెండు వామ‌నాలు 59kWh, 79kWh బ్యాట‌రీ ప్యాక్‌ల‌కు స‌పోర్ట్ చేస్తాయి. రెండింటిలోనూ ఫాస్ట్ ఛార్జింగ్ సౌక‌ర్యం క‌ల‌దు. 79kWh బ్యాట‌రీ ప్యాక్‌ను ఒక‌సారి ఛార్జ్ చేస్తే .. దాదాపు 500 కిలోమీట‌ర్లు ప్ర‌య‌ణించ‌వ‌చ్చు. 175 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జ‌ర్ ఉప‌యోగించి కేవ‌లం 20 నిమిషాల్లో 20-80% ఛార్జ్ అవుతుంద‌ని కంపెనీ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.