ఢిల్లీలోని ఇఎస్ఐసిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ESIC: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) లో 287 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నెలకు వేతనం రూ. 67,700 నుండి రూ.2,08,700 వరకు ఉంటుంది.
అనాటిమి, అనస్థీషియాలజి, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పాథాలజి, రేడియో డయాగ్నోసిస్, మైక్రోబయాలజి, సికియార్టి, ట్రాన్స్‌ప్యూజన్ మెడిసిన్, ఫిజియాలజి వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఎండి, ఎంస్, ఎండిఎస్‌తో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లకు మించరాదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఈ నెల 31. దరఖాస్తులను ది రీజనల్ డైరెక్టర్, ఇఎస్ఐసి కార్పొరేషన్, పంచ్‌దీప్ భవన్, సెక్టార్-16, (లక్ష్మీ నారాయణ్ మందిర్ దగ్గర) ఫరిదాబాద్, హరియాణా. చిరునామాకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పంపించాలి. దరఖాస్తు రుసుం రూ. 500. ఎస్ సి/ ఎస్‌టి/ పిడబ్ల్యూబిడి/ మహిళలు/ ఎక్స్ సర్వీస్ మెన్‌కు ఫీజు మినహాయించారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://www/esic.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.