48 గంట‌ల్లో రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ‌.. సిఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి (CLiC2NEWS): రికార్డు స్థాయిలో ధాన్యం సేక‌రించి 48 గంట‌ల్లోపు రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేస్తామ‌ని సిఎం చంద్ర‌బాబు అన్నారు. ధాన్యం సేక‌ర‌ణ కేంద్రాల్లో ఇక‌నుండి ఆక‌స్మిక త‌నిఖీ నిర్వ‌హిస్తామ‌ని.. ద‌ళారీ ముసుగులో రైతుల‌కు అన్యాయం చేస్తే ఊరుకోబోమ‌ని ఆయ‌న‌హెచ్చ‌రించారు. రైతు సేవా కేంద్రాలు, మిల్ల‌ర్ల వ‌ద్ద మెషీన్‌ల‌లో ధాన్యంలోని తేమ‌శాతంలో తేడా వ‌స్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వని సిఎం హెచ్చ‌రించారు. రైతుల వ‌ద్ద ధాన్యం సేక‌రించిన అనంత‌రం కేవ‌లం రెండు గంట‌ల్లో డ‌బ్బులు చెల్లించే విధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అదేవిధంగా బియ్యం అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టి తీర‌తామ‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.