జమిలి ఎన్నికల జెపిసికి ఛైర్పర్సన్ గా పిపి చౌదరి నియామకం
ఢిల్లీ (CLiC2NEWS): జమిలి ఎన్నికలపై అధ్యయనానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటి (జెపిసి)కి ఛైర్ పర్సన్‌ని నియమించారు. బిజెపి ఎంపి ఎంపి పిపి చౌదరి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జెపిసిని ఏర్పాటు చేసింది. కమిటి సభ్యుల సంఖ్య 31 ఉండగా.. గురువారం 39కి పెంచారు. దీని ప్రకారం లోక్‌సభ నుండి 27 మంది ఎంపిలు, రాజ్యసభ నుండి 12 మంది సభ్యులుగా ఉండనున్నారు.