ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నాగబాబు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో జనసేన నేత నాగబాబు బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన సతీసమేతంగా సిఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎం నాగబాబును అభినందించారు. సోదరుడైన చిరంజీవి నాగబాబును అభినందిస్తూ.. నాగబాబుతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్యా.. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుడిని. మీరు కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం.. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ కలాన్నే వినియేగించడం గౌరవంగా భావించినట్లు తెలిపారు.