యూట్యూబ్ చూసి అగ్గిపుల్లల మందుతో బాంబు తయారీ..
విజయనగరంలో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్.. భగ్నం చేసిన దర్యాప్తు సంస్థలు..

హైదరాబాద్ (CLiC2NEWS): అతనో గ్రూప్ -2 పరీక్ష రాసేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థి.. ఆన్లైన్లో పేలుడు పదార్థాలు తెప్పించి.. హైదరాబాద్‌లో ఉన్న అతని స్నేహితుడు తో కలిసి బాంబులు తయారుచేయడం. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరంలో బాంబు పేలుళ్ల రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయం. వీరి కార్యకలాపాలపై సమాచారం అందిన తెలంగాణ ఇంటిలిజెన్స్ వర్గాలు.. ఎపి పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో వారి ఇళ్లపై పోలీసులు దాడి చేసి విజయనగంలో ఉన్న సిరాజ్‌ను , సికింద్రాబాద్‌లో ఉన్న సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ తండ్రి ఎఎస్ ఐ, సోదరుడు కానిస్టేబుల్.. సిరాజ్‌ని ఓ పోలీస్ అధికారిగా చూడాలనుకున్నాడు తండ్రి .
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (అహిం) పేరిట సంస్థను ఏర్పాటు చేసి.. ఆసక్తి గల యువకులను చేర్చుకుని, దేశంలోని పేలుళ్లకు పథకరచన చేసి ఉగ్రకార్యకలాపాలను విస్తరింపజేయడమే లక్ష్యం. దీనికి సిరాజ్ , సమీర్ లు ప్రధానంగా వ్యవహరిస్తున్నారు. సౌదీ అరేబియా నుండి గుర్తుతెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రల కోసం వీరికి మార్గ నిర్దేశం చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే సౌదీ అరేబియా నుండి యువకులను ఉగ్రకుట్ర దిశగా ప్రేరేపించిన హ్యాండ్లర్ ఎవరనేది ఇప్పటివరకు తెలియలేదు.
హ్యాండ్లర్ వీరిని ‘మ్యాజిక్ లాంతర్’ ద్వారా ఎంచుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టు పెట్టి, దానికి సానుకూలంగా స్పందించే వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. వీరి గ్రూప్‌లో మరో 28 మంది ఉన్నట్లు సమాచారం. అగ్రిపుల్లల్లోని మందును వినియోగింది బాంబు తయారు విధానంపై హ్యాండ్లర్ వీరికి ఫైళ్లు పంపగా.. దీనికి అనుగుణంగా వీరు బాంబును తయారు చేశారు. ఆ బాంబును సిరాజ్ ఈనెల 12 విజయనగరంలో ప్రయోగాత్మంకంగా పరిశీలించినట్లు సమాచారం. మరోసారి ప్రయోగించే తరుణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరికీ విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సమీర్ , సిరాజ్ కలిసి అహిం సంస్థను స్థాపించి.. అందులో ఆరుగురు వ్యక్తులను ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ ఆరుగురు 3 రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం. సమీర్ , సిరాజ్‌లు పేలుడు పదార్థాలను ఆన్లైన్లో ఆర్డర్ చేయడం.. యూట్యూబ్ చూసి పేలుడు పదార్ధం తయారీ విధానం చూసి బాంబు తయారు చేశారు. వీరద్దరూ బాంబులు తయారు చేయడం.. మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని సౌదీ నుండి ఆదేశాలు వచ్చాయి. సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి.